వధూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు కుజదోష విచారణ:- పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్టమేకుజే స్ధితః కుజః పతింహంతి నచేచ్చు భయుతేక్షితః ఇందోరప్యుక్త గేహేషు స్ధితఃఅ భౌమోధవాశనిః పతిహంత్రౌస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః (బృహతృరాశరీరాశాస్త్రం) జన్మలగ్నము- చంద్రలగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నఎడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం యిరువురికీ వున్ననూ లేదా యిరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని ఎడల వైవాహిక జీవితం కలహప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయకారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. "నచేచ్చభయుతేక్షితః" అని ఉన కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహవీక్షణ వునచో దోఆషం వుండదు. కేవలం ఆడవరై జాతకంలో దోషం వుంటే మగవారికి యిబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవరైకి యిబ్బంది. ద్వితీయ భౌమరోషస్తు యుగ్న కన్యక యోర్వినా| ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా| చతుర్ధే భౌమదోషస్తు మేష వృశ్చికయోర్వినా| సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా| అష్టమే భౌమదోషస్తు ...